ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహనీయులను మరవొద్దు

ABN, First Publish Date - 2022-08-11T05:02:41+05:30

మహనీయులను మరవొద్దు

కీసర రైతు వేదిక వద్ద మొక్కనాటి నీరుపోస్తున్న మంత్రి మల్లారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  వజ్రోత్సవాల్లో భాగంగా వనమహోత్సవంలో మొక్కలు నాటిన మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్‌

ఘట్‌కేసర్‌/కీసర/కీసరరూరల్‌/వికారాబాద్‌, ఆగస్టు10: మేడ్చల్‌ వికారాబాద్‌, జిల్లాల్లో స్వాతంత్య్రవజ్రోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. రెండోరోజు వనమహోత్సవంలో భాగంగా ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో  చంద్రప్రాపర్టీ్‌సలోని పార్కుకు ఫ్రీడం పార్కుగా నామకరణం చేస్తూ   75 మొక్కలు, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కుందన్‌పల్లిలోని పార్కులో 75మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పౌరులందరూ దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. మహనీయుల త్యాగఫలంతో సాధించిన స్వతంత్ర భారత దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈనెల 13 నుండి ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి సమైఖ్యతను చాటాలని కోరారు. అంతేకాకుండా కీసర కేంద్రంలోని రైతు వేదిక వద్ద మంత్రి మల్లారెడ్డి 75 మొక్కలను నాటారు. రోటరీ క్లబ్‌ అధ్వర్యంలో యాద్గార్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలకు రోటరీ క్లబ్‌ ప్రతినిధులు స్మార్ట్‌టీవీని విరాళంగా అందజేశారు.  కాగా ప్రతిఒక్కరు దేశభక్తి కలిగిదేశానికి స్వాతంత్య్రం సంపాదించిపెట్టిన మహనీయులను స్మరించుకోవాలని మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లిలో భాగ్యనగర్‌ నందనవనం, మహాలక్ష్మీపురం ఫ్రీడం పార్కును ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో బుధవారం ఒక్కరోజే 23వేల మొక్కలు నాటినట్లు గుర్తుచేశారు. కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియా నాయక్‌, కమిషనర్‌ సురేష్‌, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీనివా్‌సరెడ్డి, నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్మన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత, వైస్‌చైర్మన్లు మల్లేష్‌, నరేందర్‌రెడ్డి, కమిషనర్లు వాణి, స్వామి, జెడ్పీ వైస్‌చైర్మన్‌, మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, ప్రభాకర్‌రెడ్డి, సత్తిరెడ్డి, సర్పంచ్‌ నాయకపు మాధురి వెంకటేష్‌, పాల్గొన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని వికారాబాద్‌ డీపీవో ఆఫీసు ఎదుట వనమహోత్సవంలో భాగంగా ఎస్పీ కోటిరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రషీద్‌, డీఎస్పీ సత్యనారాయణ, కరుణాసాగర్‌ రెడ్డి, శేఖర్‌గౌడ్‌ ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-11T05:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising