ఆలయాలకు విరాళాలు
ABN, First Publish Date - 2022-10-18T05:23:09+05:30
ఆలయాలకు విరాళాలు
తలకొండపల్లి/షాద్‌నగర్ అర్బన్, అక్టోబరు 17: గౌరిపల్లిలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి రూ.5లక్షల విరాళాన్ని అందజేశారు. ఫౌండేషన్ డైరెక్టర్ సుంకిరెడ్డి వరప్రసాద్‌రెడ్డి సోమవారం స్థానిక సర్పంచ్ అనురాధ నరేందర్‌గౌడ్, ఆలయకమిటీ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌రెడ్డిని వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, వీరన్నపల్లి సర్పంచ్ నాగమణిలింగంగౌడ్, సురేశ్‌రెడ్డి, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్, రాఘవేందర్, కొండల్, జగన్, రమేశ్ పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌లోని రైతుకాలనీలో గల కోట మైసమ్మ ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్ణాటక మురళీమోహన్ (అప్పి) రూ.లక్షా 21వేలు విరాళంగా ఇచ్చారు. సోమవారం అలయ నిర్మాణ కమిటీ సభ్యులకు విరాళాన్ని అందజేశారు. మురళీమోహన్‌ను ఆలయం నిర్మాణ కమిటీ సభ్యులు బుచ్చయ్య, ఖాజాపాష, శుక్లవర్ధన్‌రెడ్డి, విజయ్‌కుమార్‌గౌడ్, ప్రదీప్ సన్మానించారు.
Updated Date - 2022-10-18T05:23:09+05:30 IST