ధర్మసాగర్‌ను పంచాయతీగా ఏర్పాటు చేయాలి
ABN, First Publish Date - 2022-10-18T05:29:46+05:30
ధర్మసాగర్‌ను పంచాయతీగా ఏర్పాటు చేయాలి
షాబాద్, అక్టోబరు 17: మండలంలోని ధర్మసాగర్ గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. తమ గ్రామం గొల్లపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉందని వాపోయారు. నూతన పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు గ్రామానికి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనితారాజిరెడ్డి, గ్రామస్థులు చంద్రారెడ్డి, జనార్దన్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, గణేష్, మోనాచారి, మహేందర్, రాజు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:29:46+05:30 IST