ధారాసింగ్‌ను అవమానించారు
ABN, First Publish Date - 2022-10-17T05:30:00+05:30
ధారాసింగ్‌ను అవమానించారు
పెద్దేముల్, అక్టోబరు 17: ఎవరో చేసిన పనికి కాంగ్రెస్ పార్టీ ధారాసింగ్‌ను అవమానించిందని కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి అన్నారు. పార్టీకోసం పాటుపడే వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇది కాదన్నారు. సోమవారం పెద్దేముల్‌లో పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌తో కలిసి ఆమె మాట్లాడారు. ఇది పార్టీ పెద్దలు చేశారని తాము భావించడం లేదన్నారు. ఎవరో స్వార్థం కోసం జడ్పీటీసీ ధారాసింగ్‌ను పీసీసీ డెలిగేట్‌గా పేరు తొలగించారన్నారు. 12ఏళ్లుగా పీసీసీ డెలిగేట్‌గా ఉన్న ధారాసింగ్ పేరును చెప్పాపెట్టకుండా తొలగించడాన్ని తాము అవమానంగా భావిస్తున్నామన్నారు. ఆయనకు పీసీసీలో గౌరవప్రద పదవి ఇచ్చేలా నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే తామంతా పార్టీని వీడుతాం అన్నారు. పెద్దేముల్ మండల నాయకులు, కా ర్యకర్తలు ధారాసింగ్ వెనకే నడుస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మధులత, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్‌కుమార్, మాజీ సర్పంచ్ నర్సిములు, నాయకులు ఎల్లారెడ్డి, గోపాలకృష్ణ, శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేష్, బందెప్ప, రామునాయక్, మైఫుస్, పురుషోత్తం, శేఖర్, భీమ్లానాయక్, కోళ్ల పెంటప్ప, రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST