పాఠశాలల్లో డీఈవో ఆకస్మిక తనిఖీ
ABN, First Publish Date - 2022-12-07T00:00:48+05:30
డీఈవో సుశీందర్‌రావు మంగళవారం కుర్మిద్ద గ్రామంలో ప్రాథమిక పాఠశాలను, జడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
యాచారం, డిసెంబరు 6: డీఈవో సుశీందర్‌రావు మంగళవారం కుర్మిద్ద గ్రామంలో ప్రాథమిక పాఠశాలను, జడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలిమెట్టు పథకం కింద పాఠశాలలో జరుగుతున్న పలు పనులను పరిశీలించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఆయన వెంట కందుకూరు మండల ఎంఈవో కృష్ణ, హెచ్‌ఎంలు వెంకటయ్య, సత్తు పాండురంగారెడ్డి తదితరులున్నారు.
Updated Date - 2022-12-07T00:00:49+05:30 IST