ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల అస్వస్థతపై డీఈవో ఆగ్రహం

ABN, First Publish Date - 2022-12-15T22:40:19+05:30

మంబాపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రేణకాదేవి సందర్శించారు. మధ్యాహ్న భోజనం చేసిన పిల్లలు అస్వస్థతకు గురికావడంపై ఆమె ఆరా తీశారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించడం లేదా? అంటూ మండిపడ్డారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే షెడ్‌లో పరిశీలిస్తున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంబాపూర్‌ జడ్పీ పాఠశాల సందర్శన

భోజనం తయారీపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలని ఆదేశం

పెద్దేముల్‌, డిసెంబరు 15: మంబాపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రేణకాదేవి సందర్శించారు. మధ్యాహ్న భోజనం చేసిన పిల్లలు అస్వస్థతకు గురికావడంపై ఆమె ఆరా తీశారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించడం లేదా? అంటూ మండిపడ్డారు. మంబాపూర్‌ జడ్పీ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం కొందరు విద్యార్థులు వాంతి చేసుకోవడం, పత్రికల్లో వార్తులు రావడంతో డీఈవో స్పందించారు. టీచర్లను, వంట ఏజన్సీ నిర్వాహకులను ఆమె ఆరా తీశారు. భోజన నాణ్యత నిర్లక్ష్యంపై హెచ్‌ఎం, టీచర్లపై మండిపడ్డారు. విద్యార్థుల మెనూ గురించి టీచర్లను ప్రశ్నించగా టీచర్లు సరైన సమాధానం ఇవ్వలేదు. డీఈవో అందరికీ మెమోజారీచేస్తానని హెచ్చరించారు. ఫుడ్‌ పాయిజన్‌తో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యులు అని నిలదీశారు. ఇకపైన అయినా పర్యవేక్షణ చేయాలన్నారు. భోజనం సరిగా ఎందుకు చేయడం లేదని వంటచేసే మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రుల నుంచే సహాయకులుగా తీసుకోవాలని సూచించారు. గురువారం వండిన భోజనాన్ని తయారీని పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ప్రశ్నలు వేసి బోధన ఎలా ఉందని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో సంప్‌ నిర్మాణాన్ని ప్రారంభింపజేశారు. డీఈవో వెంట ఎంఈవో వెంకటయ్య ఉన్నారు.

Updated Date - 2022-12-15T22:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising