ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ కట్టడాల కూల్చివేత

ABN, First Publish Date - 2022-01-19T04:54:06+05:30

అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు

ఎక్స్‌కవేటర్‌తో అక్రమంగా నిర్మించిన ఆయిల్‌ మిల్‌ను కూల్చి వేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకర్‌పల్లి : అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని హెచ్‌ఎండీఏ టౌన్‌ప్లానింగ్‌ అధికారి కోటేశ్వర్‌రావు హెచ్చరించారు. అక్రమ కట్టడాలపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వస్తున్న వరుస కథనాలకు అధికారులు స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం శంకర్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ యాదగిరి పోలీస్‌ సిబ్బందితో కలిసి అక్రమ నిర్మణాలను కూల్చి వేయించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇంటి, పరిశ్రమల నిర్మాణాలు చేపడితే ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కూల్చివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం బడంగ్‌పేట్‌, నార్సింగి, గండిపేట్‌, మణికొండలో అక్రమ నిర్మాణాలు కూల్చి వేయించామని.. అలాగే త్వరలో శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్థుల నిర్మాణాలను కూడా కూల్చి వేయిస్తామని చెప్పారు. శంకర్‌పల్లిలో స్థానిక స్థిరాస్తి వ్యాపారి బేజుగం రాజు, కందూరి చంద్రకుమార్‌ అక్రమంగా నిర్మిస్తున్న ఆయిల్‌ ఫిల్లింగ్‌ గోదామును కూల్చి వేయించామని, దీంతోపాటు ఎలాంటి అనుమతులు లేకుండా అల్ర్టాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన రెడీమిక్స్‌ ప్లాంట్‌ను, మున్సిపాలిటీ పరిధిలోని రెండు పెట్రోల్‌ బంక్‌లను సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. అక్రమనిర్మాణాలకు ఎవరు సహకరించినా సహించేది లేదన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ అధికారులు యాదగిరి, టౌన్‌ ప్లానింగ్‌ అఽధికారి భాస్కర్‌, ఎస్‌ఐ కృష్ణ పాల్గొన్నారు.



Updated Date - 2022-01-19T04:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising