దళితులు ఆర్థికంగా ఎదగాలి
ABN, First Publish Date - 2022-03-06T05:10:36+05:30
దళితులు ఆర్థికంగా ఎదగాలి
తాండూరు/తాండూరు రూరల్/పెద్దేముల్/యాలాల, మార్చి 5 : దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని దళితులు ఆర్థికంగా ఎదగాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. దళిత సాధికారతకు దళితబంధు పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. శనివారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన దళితబంధు పథకం స్థాయీసంఘం సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో మొదటివిడతగా వందమంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించి ఎంపిక చేయడం జరిగిందని, రూ.10లక్షలతో దళితులు వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. స్థాయీ సంఘంసభ్యులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజస్, జిల్లా క్రీడల అధికారి హన్మంత్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్‌చైర్మన్ వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు రాములు, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు అప్ఫు, మండల ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లప్ప, టీఆర్‌ఎస్ నాయకులు రాజరత్నం, రామునాయక్, కరన్‌కోట్ ఉపసర్పంచ్ హేమంత్‌కుమార్, జీవరత్నం, గోపాల్, ప్రకాష్ తదితరులున్నారు.
దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలి
దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరు స్టేషన్ హనుమాన్ దేవాలయం పాలక మండలి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా పాలకవర్గ సభ్యులతో దేవాదాయశాఖ అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. చైర్మన్‌గా నియమితులైన సంజీవరావు, కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను పాలకవర్గం సభ్యులు సన్మానించారు.
బ్రిడ్జి నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
బ్రిడ్జి నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను ఆదేశించారు. పెద్దేముల్ మండలంలోని మన్‌సాన్‌పల్లి, కందనెల్లి వాగులపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల వేగం పెంచి తొందరగా అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. వర్షాకాలంలోపు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్‌చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ పెద్దేముల్ మండలాధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్, తాండూరు టౌన్ ప్రెసిడెంట్ నయీం(అప్ఫు), నాయకులు పట్లోళ్ల నర్సింహులు, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జుంటుపల్లి రామస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
యాలాల మండలం జుంటుపల్లి రామస్వామి ఆలయంలో ఎమ్మెల్యే రామస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం జుంటుపల్లి గౌడసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, నాయకులు రవీందర్‌రెడ్డి, అక్బర్‌బాబా, సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, పటేల్‌రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ నారాయణరెడ్డి, సిద్ధు, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సమీనాభానుకు రూ.67వేలు, మహబూబ్‌కు రూ.90వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు.
తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
బొంరా్‌సపేట్ : సూర్యనాయక్‌తండా బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
బొంరా్‌సపేట్/తాండూరు, మార్చి 5 : తండాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం బొంరా్‌సపేట్ మండలంలోని పలు తండాలలో బీటీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సాలిండపూర్, బురాన్‌పూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సూర్యనాయక్‌తండా మీదుగా మల్లెవోనికుంటతండా వరకు రూ.కోటీ 10లక్షల నిధులతో చేపట్టే బీటీ రోడ్డుకు శంకుస్థాపన, సూర్యనాయక్ తండాలో రూ.12 లక్షలతో నిర్మించిన శ్మశానవాటికను ప్రారంభించారు. మల్లెవోనికుంట తండా నుంచి బుగ్యానాయక్‌తండా వరకు రూ.30 లక్షలతో బీటీ రోడ్డు, గట్టెనాయక్ తండా నుంచి మదన్‌పల్లి, బురాన్‌పూర్ పీడబ్ల్యూడీ రోడ్డునుంచి దరికింది తండా మీదుగా రూ.కోటీ50లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ అరుణదేశ్యచౌహాన్, కోట్ల యాదగిరి, దేశ్యనాయక్, మహేందర్‌రెడ్డి, రమణారెడ్డి, ఎంపీటీసీలు నర్సిములు, సుదర్శన్‌రెడ్డి, రామకృష్ణాయాదవ్, సుభా్‌షరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T05:10:36+05:30 IST