ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితబంఽధును పేదలకే ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-06-28T04:51:21+05:30

దళితబంఽధును పేదలకే ఇవ్వాలి

షాద్‌నగర్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ 
  • షాద్‌నగర్‌లో పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ

షాద్‌నగర్‌అర్బన్‌, జూన్‌ 27: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధును ధనికులకు కాకుండా పేదలకే ఇవ్వాలని కాంగ్రెస్‌  పార్టీ షాద్‌నగర్‌ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దళితబంధును దళిత పేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం షాద్‌నగర్‌ పట్టణంలో ర్యాలీని నిర్వహించి, ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్‌ విలేకరులతో మాట్లాడుతూ పేదల కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం టీఆర్‌ఎస్‌ కార్యకర్తల వశమవుతోందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు తమ పార్టీ శ్రేణులకే దళితబంధు పథకాలను ఇస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా దళిత బంధును నష్పక్షపాతంగా అమలు చేయాలని లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాబర్‌ఖాన్‌, జి.బాల్‌రాజ్‌గౌడ్‌, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, కొంకళ్ళ చెన్నయ్య, జంగ నర్సింహ, కృష్ణారెడ్డి, రాజు, కొమ్ము కృష్ణ, కుమారస్వామిగౌడ్‌, సాయిలు, అంతయ్య, అనంతయ్య, నాగిళ్ళ భాస్కర్‌, చెంది తిరుపతిరెడ్డి, అందె మోహన్‌, బాదేపల్లి సిద్దార్థ, పి.రఘు, శ్రీశైలం, సురేష్‌, అనంతయ్య, నెహ్రూనాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T04:51:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising