ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛంద సంస్థల చేయూత

ABN, First Publish Date - 2022-07-03T05:56:36+05:30

స్వచ్ఛంద సంస్థల చేయూత

మాడ్గుల: విద్యార్థులకు సామగ్రిని అందజేస్తున్న హెల్పింగ్‌ హ్యాండ్‌ 4 పూర్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్గుల/కేశంపేట/మాడ్గుల/షాబాద్‌, జూలై 2: మాడ్గుల మండలంలోని నాగిల్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో  హెల్పింగ్‌ హ్యాండ్‌ 4పూర్‌ ఆధ్వర్యంలో 306మంది విద్యార్థులకు రూ.లక్షా 67వేల విలువ గల విద్యాసామగ్రిని పంపిణీ చేశారు. ప్రాజెక్ట్‌ ఎస్‌ఎఎస్‌ కార్యక్రమంలో భాగంగా సినెర్జె గ్లోబల్‌ టూల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వారి సౌజన్యంతో అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు గణేష్‌, అభిలాష్‌, సందీప్‌, శ్రీకాంత్‌, సాయికిరణ్‌, ప్రతీక్‌, బాబు, ధన్నారం కార్తిక్‌, హెచ్‌ఎం లావణ్య పాల్గొన్నారు. కేశంపేటలోని మూడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం 400మంది విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, ఇతర సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో మనోహర్‌, కేశంపేట, చౌలపల్లి హెచ్‌ఎంలో రసూల్‌, జోసేఫ్‌, ఫౌండేషన్‌ సభ్యుడు పూర్ణచందర్‌రావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ లక్ష్మయ్య పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని కాకునూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాత అల్లం హనుమంత్‌రెడ్డి బ్యాగ్‌లు, షూ, టై, బెల్ట్‌లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను సర్పంచ్‌  గండ్ర లక్ష్మమ్మ, ఇన్‌చార్జి ఎంఈవో మనోహర్‌లు అభినందించారు. ఈ కార్యక్రమంలో గండ్ర సతీష్‌, కోడూరి రాములు పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండల పరిధిలోని తిర్మలాపూర్‌ ప్రాథమిక పాఠశాలకు అదే గ్రామానికి చెందిన రిటైర్ట్‌ ఉపాధ్యాయులు కడుమూరి సత్తయ్య విద్యార్థులకు బ్యాగ్స్‌, నోట్‌బుక్స్‌ అందజేశారు.  ఎంఈవో, ఎంపీడీవో అభినందించారు. 

Updated Date - 2022-07-03T05:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising