ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడు

ABN, First Publish Date - 2022-05-21T05:42:50+05:30

సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడు

ఆగ్రోస్‌ కేంద్రంలో రైతులకు రాయితీపై విత్తనాలు అందజేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పరిగి, మే 20 : సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మార్కెట్‌యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 

  • సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి

రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని ఎమ్మెల్యే సూచించారు. పరిగిలోని ఆగ్రోస్‌ కేంద్రంలో రాయితీపై ఇస్తున్న జీలుగ, జనుము విత్తనాలను ఆయన రైతులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జీలుగ 30 కిలోల బస్తా రూ.670, జనుము 40 కిలోల బస్తా రూ.1165 చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుందని తెలిపారు. ఆసక్తి గల రైతులు పట్టా పాసుపుస్తకం జిరాక్స్‌, ఆధార్‌ నెంబర్‌, ఫోన్‌నంబర్లతో ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. 

  • ఘనంగా బొడ్రాయి, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన

పరిగి మండలం చిట్యాల్‌ గ్రామంలో హనుమాన్‌ దేవాయంలో దగ్గర బొడ్రాయి, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, ఎంపీపీ అరవింద్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు ఆర్‌.అంజనేయులు, కల్లు శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, అశోక్‌వర్ధన్‌రెడ్డి, దోమ జడ్పీటీసీ కె.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T05:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising