అంతారంలో సీఐపీఎంసీ బృందం పర్యటన
ABN, First Publish Date - 2022-12-07T22:48:51+05:30
తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలోని దస్తగిరిపేట్‌లో బుధవారం కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం(సీఐపీఎంసీ) అధికారుల బృందం పర్యటించింది.
తాండూరురూరల్, డిసెంబరు7: తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలోని దస్తగిరిపేట్‌లో బుధవారం కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం(సీఐపీఎంసీ) అధికారుల బృందం పర్యటించింది. కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్‌ప్లాంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు శ్వేతాసిర్‌పూర్, రవిశంకర్ గ్రామంలో కూరగాయలను పండించేందుకు సాగు భూములను పరిశీలించారు. కూరగాయల కోసం దస్తగిరిపేట్‌లో పొలంబడి కార్యక్రమానికి అనువుగా ఉందని భూమిని పరిశీలించారు. అనంతరం ఉల్లిపంటను పరిశీలించారు. ఉల్లికి సోకే తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. ఉల్లిపంటకు ప్రధానంగా తామర పురుగు సోకుతుందని, వాటిని నివారించేందుకు ఐదు గ్రాముల టైకోటర్మా, 20గ్రాముల బెల్లం పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. అదేవిధంగా వేపనూనెను కూడా పిచికారి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల వ్యవసాయాధికారి రజిత పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T22:48:52+05:30 IST