డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురిపై కేసు
ABN, First Publish Date - 2022-11-30T00:25:11+05:30
డ్రంకైన్ డ్రైవ్‌లో పట్టుబడిన నలుగురు లారీ డ్రైవర్లపై కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు.
కులకచర్ల, నవంబరు 29: డ్రంకైన్ డ్రైవ్‌లో పట్టుబడిన నలుగురు లారీ డ్రైవర్లపై కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు. సోమవారం అర్ధరాత్రి కులకచర్ల చౌరస్తాలో పోలీ్‌సలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో పాలమూరు నుంచి పరిగి వెళ్తున్న నాలుగు లారీలను ఆపి డ్రైవర్లు దత్తు, గురుదాస్, కాశీనాథ్, అనిల్‌లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయగా మద్యం సేవించినట్లు రుజువైంది. డ్రైవర్లతో పాటు లారీలను పీఎ్‌సకు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. మంగళవారం లారీల ఓనర్ బాల్‌రాజ్‌ను పిలిపించి, డ్రైవర్లకు అతడి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - 2022-11-30T00:25:12+05:30 IST