ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు కలేనా?

ABN, First Publish Date - 2022-02-14T05:19:05+05:30

మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హామీలకే పరిమితం
  • ఉన్నత విద్యకు పేద విద్యార్థులు దూరం


తలకొండపల్లి , ఫిబ్రవరి 13:  మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. కళాశాల అందుబాటులో లేక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. విధిలేక ఆమనగల్లు, మిడ్జిల్‌, షాద్‌నగర్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేట్‌ కాలేజీలో చదివించాల్సి వస్తుందని పలువురి విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. డబ్బులు కట్టలేని వారు పదోతరగతితోనే చదువు ఆపేస్తున్నారు. తలకొండపల్లి, వెల్జాల్‌, గట్టిప్పలపల్లి, చంద్రధన, పడకల్‌, చుక్కాపూర్‌, రాంపూర్‌, ఖానాపూర్‌ గ్రామాలలో పైచదువులు చదవడానికి కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాల ఏర్పాటు గురించి విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని వాపోతున్నారు. పలు మార్లు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులకు విన్నవించినా కళాశాల ఏర్పాటుకు నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటుకు స్థానిక ప్రజాప్రతినిధులు. అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2022-02-14T05:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising