సమయానుకూలంగా బస్సులు నడపాలి
ABN, First Publish Date - 2022-12-15T00:28:49+05:30
ఆర్టీసీ బస్సులను సమయానుకూలంగా నడపడం లేదని పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీవిద్యార్థులు ధర్నాకు దిగారు.
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు
ధారూరు, డిసెంబరు 14 : ఆర్టీసీ బస్సులను సమయానుకూలంగా నడపడం లేదని పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీవిద్యార్థులు ధర్నాకు దిగారు. ధారూరులోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద వికారాబాద్-తాండూరు రోడ్డుపై బైఠాయించి వికారాబాద్ ఆర్టీసీ డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో కొద్దిసేపు రాకపోకలు స్తంభించిపోయాయి. కాగా, మండలంలోని ధారూరు, అవుసుపల్లి, కుక్కింద, కొండాపూర్, స్టేషన్ ధారూరు, కేరెల్లి తదితర గ్రామాల నుంచి ప్రతీరోజు పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, బస్సులను సమయానుకూలంగా నడపడం లేదని, ఉదయం 9గంటల వరకు ఆర్డినరీ బస్సులు రావటం లేదని, తరగతులకు అలస్యంగా వెళుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సాయంత్రం 4గంటల తర్వాత వికారాబాద్ నుంచి బస్సులు ఉండటం లేదని 7గంటల తర్వాత బస్సులు వస్తుండటంతో రాత్రి 8గంటలకు ఇంటికి చేరుకుంటున్నామని, సమయానికి తగ్గట్టుగా బస్సులు నడపాలని డీఎంను కోరారు.
Updated Date - 2022-12-15T00:28:50+05:30 IST