ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

ABN, First Publish Date - 2022-12-15T00:19:24+05:30

కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కార్యాలయంపై పోలీ్‌సలు దాడి చేసి కంప్యూటర్‌ హార్డ్‌డి్‌స్కలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

పరిగి : సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ అర్బన్‌/పరిగి, డిసెంబరు 14: కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కార్యాలయంపై పోలీ్‌సలు దాడి చేసి కంప్యూటర్‌ హార్డ్‌డి్‌స్కలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు బుధవారం పరిగిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పరుశరాంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలపై పోలీసుల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు కొమిరె రాంచంద్రయ్య, ఎన్‌.రామకృష్ణ, మహిళా అధ్యక్షురాలు సరితా పవార్‌, నాయకుడు రాజపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మేడ్చల్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిని బుధవారం కొంపల్లిలోని ఆయన నివాసంలో బోయిన్‌పల్లి పోలీసులు గృహనిర్భంధం చేశారు. కాంగ్రెస్‌ వార్‌రూంపై పోలీసుల దాడికి నిరసనగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరివర్ధన్‌రెడ్డిని తెల్లవారుజామునే గృహనిర్భంధం చేశారు. అలాగే కాంగ్రెస్‌ నాయకులు జిల్లాలో ఎక్కడా నిరసనలు తెలపకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Updated Date - 2022-12-15T00:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising