బీఆర్‌ఎస్ పటిష్టతకు కృషి చేయాలి
ABN, First Publish Date - 2022-12-15T23:56:06+05:30
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, పార్టీ పటిష్టతకు ప్రతీఒక్కరు కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.
కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి రూరల్, డిసెంబరు 15: పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, పార్టీ పటిష్టతకు ప్రతీఒక్కరు కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగి మండల పరిధిలోని రంగాపూర్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చేలా స్థానికంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ కుటుంబానికి అందుతున్నాయని, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులదేనని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కాబోతున్నాయన్నారు. త్వరలో రైతు రుణమాఫీ, ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు రాబోతున్నాయన్నారు. అనంతరం గ్రామాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎంపీపీ అరవింద్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పరిగి మున్సిపల్ చైర్మన్ అశోక్‌కుమార్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ భాస్కర్, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ రాజేందర్, పార్టీ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, ప్రదీ్‌పరెడ్డి, వెంకటయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:56:07+05:30 IST