ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెగిన విద్యుత్‌ వైర్‌.. పట్టించుకోని అధికారులు

ABN, First Publish Date - 2022-12-16T23:16:19+05:30

చిన్నతూండ్ల గ్రామ పరిధిలో 132 కేవీ వైర్‌ తెగి పంటపొలాల్లో పడిపోయినా విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

చిన్నతూండ్లలో పొలంలో పడిపోయిన 132 కేవీ విద్యుత్‌ వైర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం, డిసెంబరు 16: చిన్నతూండ్ల గ్రామ పరిధిలో 132 కేవీ వైర్‌ తెగి పంటపొలాల్లో పడిపోయినా విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగి విద్యుత్‌ వైర్‌ తెగిపడిందని తెలిపారు. దీంతో 10 వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయాయని చెప్పారు. ఈ విషయమై బాధిత రైతులు ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించగా... గ్రామానికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. కాగా, గురువారం తెగిన వైరును పునరుద్ధరిస్తామని విద్యుత్‌ అధికారులు చెప్పారు. కానీ శుక్రవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రమాదం వల్ల సుమారు రూ.లక్షా 10వేల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని వాపోయారు. తమకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-16T23:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising