ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూస్టర్‌ డోస్‌ ఇప్పించాలి

ABN, First Publish Date - 2022-08-04T05:46:53+05:30

బూస్టర్‌ డోస్‌ ఇప్పించాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం, ఆగస్టు 3: మండలంలో ఇప్పటి వరకు రెండు డోస్‌లు కరోనా టీకా తీసుకున్న వారికి బూస్టర్‌ డోస్‌ ఇప్పించాలని, కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఎంపీపీ సుకన్యబాషా, ఎంపీడీవో విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో వారు మాట్లాడారు. బూస్టర్‌ డోస్‌ ఇప్పించే విషయంలో గ్రా మస్తులను చైతన్యం చేయాలన్నారు. ఇటీవల పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని ఇండ్లు కూలితే తక్షణమే రెవెన్యూ అధికారులకు సమాచారమందించాలని చెప్పారు. తాగు నీరు కలుషితం కాకుండ వాటర్‌ మెన్‌ను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి వారం సమావేశం ఉంటుందని గమనించి సంక్షేమ పథకాల అమలు విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. హరితహారం కింద విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీవో ఉమారాణి, ఉపాధి హామీ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T05:46:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising