ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ అవకాశవాద రాజకీయాలు

ABN, First Publish Date - 2022-05-16T05:12:50+05:30

రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ అవకాశవాద రాజకీయాలు

విలేకరులతో మాట్లాడుతున్న గోలి శ్రీనివాస్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి 


ఆమనగల్లు, మే 15: రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో బీజేపీ అవకాశవాద రాజకీయాలు సాగిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఆమనగల్లు పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. బీజేపీని తెలంగాణ ప్రజలు విశ్వసించరని, వచ్చే ఎన్నికల అనంతరం తెలంగాణలో బీజేపీ ఉనికి లేకుండా పోతుందని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్‌షా గుర్తించి మసులుకోవాలన్నారు. తుక్కుగూడ బీజేపీ సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీయేతర పాలిత ప్రాంత రాష్ట్రమైన తెలంగాణలో జరుగుతున్న అబివృద్ధిని చూసి ఆపార్టీ నాయకులు ఓర్వలేక కులం, మతం పేరుతో అలజడులు సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. బీజేపీ నేతలది రాజకీయ హడావుడే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికార మార్పిడి ఎవరి వల్ల సాధ్యం కాదని శ్రీనివా్‌సరెడ్డి స్పష్టం చేశారు. మరో 10 సంవత్సరాలు తెలంగాణలో టీఆర్‌ఎ్‌సదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ అన్ని వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆమనగల్లు ఎంపీపీ అనితవిజయ్‌, వైస్‌ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్‌ సురమల్ల సుభాష్‌, నాయకులు రూపం వెంకట్‌రెడ్డి, శివకుమార్‌, గుమ్మకొండ రాజు, సతీష్‌, చంద్రశేఖర్‌రెడ్డి, రవికుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T05:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising