ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలి

ABN, First Publish Date - 2022-12-31T23:51:54+05:30

హిందూ దేవుళ్లు, దేవతల పట్ల అసభ్యకరంగా మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరీ నరే్‌షను కఠినంగా శిక్షించాలని బీజేపీ, విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

షాద్‌నగర్‌: మాట్లాడుతున్న బీజేపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌/యాచారం/షాబాద్‌/కడ్తాల్‌/నందిగామ, డిసెంబరు 31: హిందూ దేవుళ్లు, దేవతల పట్ల అసభ్యకరంగా మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరీ నరే్‌షను కఠినంగా శిక్షించాలని బీజేపీ, విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. షాద్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్‌ నేత నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. హిందువుల పట్ల ఎంఐఎం నేత అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆనాడే చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ, విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ నేతలు చెట్ల వెంకటేష్‌. మోహన్‌సింగ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా యాచారంలో హనుమాన్‌ శక్తి జాగరణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.తిరుమలేష్‌ ఆధ్వర్యంలో సాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అదేవిధంగా షాబాద్‌లో అయ్యప్ప సేవాసమితి నాయకులు నర్సింహులు, దేవెందర్‌రెడ్డి, సురేష్‌ రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కిరణ్‌, భజరంగ్‌దళ్‌ కన్వీనర్‌ రమేష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల మండల కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మండల కన్వీనర్‌ పోతుగంటి మహేశ్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌కు చేరుకొని నరేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి.భాస్కర్‌, కార్యదర్శి కె.వినోద్‌, పవన్‌, శేఖర్‌, సాయిలు, కుమార్‌, మల్లేశ్‌, మధు, భగీరథ్‌, రాఘవేంద్ర, ప్రవీణ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా నందిగామ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం నందిగామ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయకమిటీ సభ్యులు దేపల్లి అశోక్‌గౌడ్‌, బంటారం సుదర్శన్‌గౌడ్‌, కుమార్‌గౌడ్‌, నర్సింలు, బి.కృష్ణ, సి.కృష్ణ, వెంకట్‌రెడ్డి, నిరంజన్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising