ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం

ABN, First Publish Date - 2022-10-08T04:58:46+05:30

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుబాటులో

వైద్యపరీక్షలు చేస్తున్న డాక్టర్‌ అమృత జోసెఫ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌదరిగూడ, అక్టోబరు 7: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని డాక్టర్‌ అమృత జోసెఫ్‌ అన్నారు. జిల్లేడ్‌ చౌదరిగూడ మండల కేంద్రంలోని ఆర్యసమాజ్‌ ఆవరణలో శుక్రవారం కొందుర్గు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సర్పంచ్‌ గూడ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అమృత జోసెఫ్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలన్నారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో 136మందికి వైద్యపరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదని సూచించారు. అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేష్‌ బాబు, ఎంపీహెచ్‌ఈవో ప్రభులింగం, రాఘవులు, అశ్వాక్‌ అహ్మద్‌, లూథి పాల్గొన్నారు.



Updated Date - 2022-10-08T04:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising