ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు

ABN, First Publish Date - 2022-07-06T05:28:26+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు

షాద్‌నగర్‌ రూరల్‌: విద్యార్థులను అభినందిస్తున్న ఎంఈవో, పాఠశాల ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ రూరల్‌/ఆమనగల్లు, జూలై 5: ప్రైవేట్‌ క ంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఫరూఖ్‌నగర్‌ ఎంఈవో శంకర్‌రాథోడ్‌ అన్నారు. బూర్గుల పాఠశాలలో పది ఫలితాల్లో 10జీపీఏ సాధించిన విద్యార్థులు జ్యోత్స్న, ఉత్తమ మార్కులు సాధించిన ఇతర విద్యార్థులను మంగళవారం అభినందించారు. సజ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌లు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటారన్నారు. మానసిక వికాసానికి సంబంధించిన పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. మాజీ సర్పంచ్‌ సుమన పుస్తకాలను, ధనలక్ష్మి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జయప్రద, టీచర్లు ఉన్నారు. విద్యే ప్రగతికి మూలం అని, చదువుతో సంస్కారం, సమాజంలో కీర్తిప్రతిష్టలు లభిస్తాయని ఆమనగల్లు మున్సిపల్‌ కౌన్సిలర్‌ లక్ష్మణ్‌ అన్నారు. పట్టణంలోని జెడ్పీ బాలికల పాఠశాలలో టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య హాజరయ్యారు. విద్యార్థినులను సత్కరించారు. చదువు, ప్రతిభలకు పేదరికం అడ్డు కాదన్నారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ ప్రభావతి, ఇన్‌చార్జి హెచ్‌ఎం ప్రేమకుమారి, టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising