ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చావు డప్పు కొట్టి పన్ను వసూళ్లా?

ABN, First Publish Date - 2022-12-15T00:20:23+05:30

చావు డప్పు కొడుతూ పన్నులు వసూలు చేయడమేమిటని బీజేపీ మండలాధ్యక్షుడు చలువాది ప్రవీణ్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ మండల అధ్యక్షుడు చలువాది ప్రవీణ్‌రావు

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 14 : చావు డప్పు కొడుతూ పన్నులు వసూలు చేయడమేమిటని బీజేపీ మండలాధ్యక్షుడు చలువాది ప్రవీణ్‌రావు అన్నారు. చావు డప్పు గ్రామస్తుల ఇళ్ల ముందు కాదు.. కేసీఆర్‌ ఇంటి ముందు కొడితే పంచాయతీలకు నిధులు వస్తాయని అన్నారు. పన్ను వసూలు పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయమై బుధవారం ఎదులాబాద్‌ పంచాయతీ ఎదుట బీజేపీ గ్రామశాఖ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు పదుల సంఖ్యలో వెలుస్తున్నా.. పాలకవర్గం కానీ, కార్యదర్శి కానీ పట్టించుకోవడం లేదని, పేదవారు ఇంటి పన్ను సకాలంలో చెల్లించకుంటే ఇళ్ల ముందు చావు డప్పు కొట్టి వసూలు చేయడమేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ ఆధారిత గ్రామం కావడం వల్ల రైతులు డబ్బులు చెల్లించడానికి కొంత సమయం ఇవ్వాలన్నారు. బీజేనీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని పాలకవర్గం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, గ్రామశాఖ ఆధ్యక్షుడు కుమారస్వామి, నాయకులు వెంకటేష్‌, వంశీ, ఆంజనేయులు, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising