నారా లోకేష్ కోసం బక్కని పూజలు
ABN, First Publish Date - 2022-01-24T05:13:05+05:30
నారా లోకేష్ కోసం బక్కని పూజలు
షాద్‌నగర్ అర్బన్, జనవరి 23: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లు జీవించాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు రామేశ్వరం ఆలయంలో ఆదివారం పూజలు చేశారు. నారా లోకేష్ పుట్టిన రోజును పురష్కరించుకొని ఆరోగ్యంగా ఉండేలా అశీర్వదించాలని పూజించారు. అలాగే టీడీపీ మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఇన్చార్జి మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో కేక్ కట్ చేసి, కార్యకర్తలకు తినిపించారు. కార్యక్రమంలో గంధం ఆనంద్, విఠ్యాల అంజయ్య, కావలి నర్సింహులు, గంటెల శంకరయ్య, వేముల అంజయ్య, సి.చెన్నయ్య, బక్కని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-24T05:13:05+05:30 IST