కాంగ్రెస్ సోషల్ మీడియా సమన్వయకర్తగా అజీం
ABN, First Publish Date - 2022-12-07T23:53:01+05:30
కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా తలకొండపల్లికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు అజీం నియామకమయ్యారు.
తలకొండపల్లి, డిసెంబరు 7: కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా తలకొండపల్లికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు అజీం నియామకమయ్యారు. కడ్తాల మండలం మక్తమాదారంలో బుధవారం ఏఐసీసీ కార్యదర్శి, చల్లా వంశీచంద్‌రెడ్డి అజీంకు నియామకపత్రాన్ని అందజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసమస్యలపై చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా అజీంను నియమించినట్టు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని అజీం తెలిపారు. వంశీచంద్‌రెడ్డికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ సభ్యుడు ఐళ్ల శ్రీనివా్‌సగౌడ్, డీసీసీ నాయకుడు గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, యాట నర్సింహ్మ, మహేశ్, బిక్యానాయక్, ఎం.అంజయ్య, రవీందర్, జనార్ధన్‌రెడ్డి, శ్రీశైలం, జనార్థన్‌గౌడ్, చెన్నకేశవులు, కృష్ణ, పారేశ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:53:02+05:30 IST