ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ

ABN, First Publish Date - 2022-11-21T00:02:11+05:30

శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని ఆర్భీనగర్‌ బస్తీలో ఆదివారం జరిగిన అయ్యప్పస్వామి పడిపూజలో ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ పాల్గొని పూజలు నిర్వహించారు.

శంషాబాద్‌: పడిపూజలో పాల్గొని పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌/షాబాద్‌/కొత్తూర్‌/ఆమనగల్లు, నవంబరు 20: శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని ఆర్భీనగర్‌ బస్తీలో ఆదివారం జరిగిన అయ్యప్పస్వామి పడిపూజలో ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ పాల్గొని పూజలు నిర్వహించారు. స్థానికుడు నర్సింగ్‌రావు 18వ సారి అయ్యప్పమాల ధరిస్తున్న సందర్భంగా అయ్యప్పస్వామికి 18వ మహాపడిపూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాన్ని శంషాబాద్‌కు చెందిన ప్రసిద్ధ బాబు గురుస్వామి నిర్వహించారు. అయ్యప్ప గీతాలు ఆలపిస్తూ అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, నాయకులు మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండల కేంద్రంలో శనివారం రాత్రి జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి గృహంలో శ్రీ సతీషన్‌ నాయర్‌ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజల్లో రంగారెడ్డి జిల్లా జడ్పీచైర్మన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, ప్రకా్‌షగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, నర్సింగ్‌రావు, శ్రీనివా్‌సగౌడ్‌, నర్సింహారెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్‌ మండల కేంద్రంలోని వంశీగౌడ్‌నివాసంలో అదివారం అయ్యప్పస్వామి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రవణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు బి.దేవేందర్‌యాదవ్‌, సిద్దార్థరెడ్డి, అర్జున్‌గౌడ్‌, నరే్‌షగౌడ్‌, మధుసూదన్‌గౌడ్‌, రాఘవేందర్‌యాదవ్‌, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలోని అయ్యప్ప కొండపై గల అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. లయన్స్‌క్లబ్‌ ఉపాధ్యక్షుడు, ప్రముఖ సంఘసేవకుడు పాపిశెట్టి రాము ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు బిక్ష ఏర్పాటు చేశారు. భక్తులతో కలిసి రాము ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాములు సతీష్‌, అశోక్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising