వైభవంగా అయ్యప్ప దివ్య పడిపూజ
ABN, First Publish Date - 2022-12-15T23:52:22+05:30
అయ్యప్పస్వామి దివ్య పడిపూజ మహోత్సవం పరిగిలోని మినీస్టేడియం వేదికగా అంగరంగవైభవంగా జరిగింది.
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం, అయ్యప్ప స్వాములు
పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి, డిసెంబరు 15 : అయ్యప్పస్వామి దివ్య పడిపూజ మహోత్సవం పరిగిలోని మినీస్టేడియం వేదికగా అంగరంగవైభవంగా జరిగింది. డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిలతోపాటు జిల్లాలోని పలు మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, అయ్యప్పస్వాములు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. గురువారం ఉదయం బహార్‌పేట్ హనుమాన్ దేవాలయం నుంచి మినీస్టేడియం వరకు స్వామివారి ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల బృందాలు ఆటపాటలతో భారీగా ఊరేగింపు నిర్వహించారు. మినీస్టేడియంలో శబరిమలై అయ్యప్ప దేవాలయ మేల్శాంతి బ్రహ్మశ్రీ శంభూనంబూద్రి స్వామి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డిల ఆధ్వర్యంలో దివ్య పడిపూజ నిర్వహించారు. వేలాది మంది అయ్యప్ప భక్తులు, సివిల్ భక్తులతో మైదానం కిటకిటలాడింది. అయ్యప్ప స్వాములకు భిక్ష, భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డిలు మాట్లాడుతూ.. ప్రతీఒక్కరు భక్తిభావం పెంపొందించుకోవాలన్నారు. పరిగి మునిసిపల్ చైర్మన్ ఎం.అశోక్, ఆర్బీఎల్ ఎండీ బి.శ్రీనివా్‌సరెడ్డి, పూడూరు జడ్పీటీసీ మేఘమాల, పరిగి మాజీ సర్పంచ్ సిద్దాంతి పార్థసారథి, ఏఎంసీ మాజీ చైర్మన్లు కమతం శ్రీనివాస్, కె.భాస్కర్‌గుప్త, పరిగి, కులకచర్ల మండలాల రైతుబంధు కో-ఆర్డినేటర్లు రాజేందర్, పీరంపల్లి రాజు, మాజీ జడ్పీటీసీ బాబయ్య, మాజీ వైస్‌ఎంపీపీ మాణిక్యం, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌వర్ధన్‌రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కులకచర్ల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కులకచర్ల : స్థానిక అయ్యప్పస్వామి దేవాలయంలో గురువారం శబరిమల అయ్యప్ప దేవస్థానం మేల్శాంతి బ్రహ్మశ్రీ శంభూనంబూద్రి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి నివాసంలో హోమం, ప్రత్యేక పూజలు చేశారు. కాగా, పరిగిలో నిర్వహించే అయ్యప్ప దివ్య మహా పడిపూజ కార్యక్రమానికి వెళ్లున్న శంభూనంబూద్రి స్వామి స్థానిక అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు నియమ నిష్టలతో దీక్ష చేపట్టాలని సూచించారు. గురుస్వాములు ఈశ్వరయ్య, సతీ్‌షకుమార్, వెంకట్రామిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా బొడ్రాయి పునః ప్రతిష్ఠాపన
మేడ్చల్(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మేడ్చల్‌లో బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా గురువారం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూజలు వైభవంగా నిర్వహించారు. మేడ్చల్ మున్సిపల్ పట్టణానికి చెందిన రామన్నగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేడ్చల్ మాజీ సర్పంచ్ సమితి అధ్యక్షుడు చీదు దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్లిఖార్జునస్వామి, గురుస్వాములు కిష్టయ్య పంతుల సమక్షంలో రూ.5.లక్షలు, చెరువుకొమ్ము శ్రీనివా్‌సగౌడ్ రూ.21వేల విరాళం అందజేశారు.
నేటి నుంచి రంగనాయక స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు
ఘట్కేసర్ రూరల్ : నేటి నుంచి మండల పరిధి ఏదులాబాద్‌లో గల గోదాసమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు అత్యంత వైభంగా నిర్వహించనున్నారు. గ్రామంతో పాటు నగరం నుంచి భక్తులు పెద్దఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ధనుర్మాసం నేడు సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రారంభమై సంక్రాంతి తర్వాతి రోజు కనుమతో ముగుస్తుందని ఆలయ ధర్మకర్తలు పొరెత్తి పవనాచార్యులు తెలిపారు. ప్రతీరోజు తెల్లవారుజాము నుంచి తిరుప్పావై, అర్చనలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ధనుర్మాసంలో అమ్మవారిని నిష్టతో పూజిస్తే ఆటంకాలు తొలుగుతాయని, సూర్యోదయానికి ముందుగా దర్శించుకుంటే మంచి ఫలితం లభిస్తుందన్నారు.
Updated Date - 2022-12-15T23:52:23+05:30 IST