ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రోద్బలంతోనే శ్రీరామలింగేశ్వర కళాశాల ఎత్తివేతకు యత్నం

ABN, First Publish Date - 2022-06-28T05:47:34+05:30

టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రోద్బలంతోనే శ్రీరామలింగేశ్వర కళాశాల ఎత్తివేతకు యత్నం

కులకచర్ల చౌరస్తాలో రిలే దీక్షలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

కులకచర్ల, జూన్‌27: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే కులకచర్లలోని శ్రీరామలింగేశ్వర కళాశాలను ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం కులకచర్ల చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామలింగేశ్వర కళాశాలను ఎత్తివేసే ప్రయత్నం మానుకోవాలని ఒక్క రోజు రిలే నిరాహార దీక్ష చేశారు. దీక్షలో కూర్చున్న వారికి మద్దతుగా రామ్మోహన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కమతం రాంరెడ్డి హయాంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటు చేశారన్నారు. నేడు టీఆర్‌ఎస్‌ నాయకులు కళాశాలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రయత్నం మానుకోవాలన్నారు. దీక్షలో చేసిన వారికి నిమ్మరసమిచ్చి విరమింపజేశారు. డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శు ఆంజనేయులు. గోపాల్‌, చౌడాపూర్‌ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, భరత్‌కుమార్‌, అంజిలయ్యగౌడ్‌, ఎంపీటీసీ ఆనందం, అంతారం సర్పంచ్‌ కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising