ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్టహాసంగా టీఎల్‌ఎం మేళా

ABN, First Publish Date - 2022-12-31T00:07:02+05:30

కడ్తాల మండల కేంద్రంలో శుక్రవారం బోధనోపకరణాల మేళాను అట్టహాసంగా నిర్వహించారు.

మేళాలో బతుకమ్మలతో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌, డిసెంబర్‌ 30 : కడ్తాల మండల కేంద్రంలో శుక్రవారం బోధనోపకరణాల మేళాను అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన టీఎల్‌ఎం మేళాలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల టీఎల్‌ఎం మేళాను కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ ప్రారంభించారు. 34 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సైన్స్‌ , గణిత, ఇంగ్లిష్‌, ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ పై రూపొందించిన 136 అంశాలకు చెందిన ప్రయోగాలను , పాఠ్యాంశాల అంశాలను ప్రదర్శించారు. మేళాను మాల్దీవుల ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. టీఎల్‌ఎం మేళా ముగింపు కార్యక్రమానికి ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. కమ్లీమోత్యనాయక్‌, చెన్నకేశవులు, సువర్ణవినాయక్‌, రవిప్రకాశ్‌, సైదిరెడ్డి, లక్ష్మీనర్సింహరావు, శేషు, వెంకటేశ్‌, కృష్ణయ్య, గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, ఆనంద్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

బోధనోపకరణాలతో విద్యాభ్యాసం సులభతరం

మంచాల : బోధనోపకరణాలతో బోధన విద్యార్థులకు అభ్యాసం సులభతరంగా ఉంటుందని డీఈవో సుశీందర్‌రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని నోముల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన టీఎల్‌ఎం మేళాను డీఈవో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తువెంకటరమణారెడ్డి తిలకించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

నందిగామ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని జడ్పీవై్‌సచైర్మన్‌ ఈట గణేష్‌ అన్నారు. నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి బోధనోపకరణాల మేళాను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంక, సర్పంచ్‌ జిల్లెల్ల వెంకట్‌రెడ్డి, పద్మారెడ్డి, రాములు, శ్రీనివాస్‌రెడ్డి, దినేష్‌, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు భేష్‌

ఆమనగల్లు : గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను మాల్దీవుల ప్రజాప్రతినిధుల బృందం ప్రశంసించింది. జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ, పంచాయతీ రాజ్‌ శాఖల ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్‌డీలో స్థానిక ప్రజాప్రతినిధుల సామర్థ్యాల పెంపు, గ్రామాల అభివృద్ధిపై ఈనెల 19 నుంచి 31 వరకు అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సుకు మాల్దీవుల లోకల్‌ గవర్నింగ్‌ అఽథారిటీ డైరెక్టర్‌ హవ్వా ఇజ్‌వాత్‌ నేతృత్వంలో 17 మంది అటోల్‌ కౌన్సిలర్స్‌ హాజరయ్యారు. క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా శుక్రవారం మాల్దీవుల ప్రజాప్రతినిధుల బృందం కడ్తాల గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించింది. తొలిసారిగి కడ్తాలకు వచ్చిన వారికి సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి , గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు.

Updated Date - 2022-12-31T00:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising