ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసంఘటితులకుభరోసా

ABN, First Publish Date - 2022-01-26T04:22:04+05:30

అసంఘటితులకుభరోసా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  •  ఈ- శ్రమ్‌ యోజన పథకంలో 50 వేల మంది కార్మికుల నమోదు
  •  మేడ్చల్‌ జిల్లాలో అత్యధికంగా చేరిక  

మేడ్చల్‌, జనవరి 25 ( ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర తీసుకొచ్చిన బీమా(ఈ-శ్రమ్‌ యోజన) పథకం వారి జీవితాలకు భరోసా నిచ్చింది.  కార్మికులకు పలు ప్రయోజనాలు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేసింది.  అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకుంటే పీఎంఎ్‌సబీవై కింద రూ. రెండులక్షల ఉచిత బీమా అందిస్తోంది.  2021 ఆగస్టు 26 నుంచి ప్రారంభమైన ఈ- శ్రమ్‌ యోజన  బీమా పథకం కార్మికులకు అండగా నిలుస్తోంది. మేడ్చల్‌ జిల్లా నుంచి 50 వేల మందిపైగా అసంఘటిత కార్మికులు తమ పేర్లను పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు జిల్లా కార్మికశాఖ అధికారిప్రభావతి తెలిపారు. జిల్లాలో 66,479 అసంఘటిత కార్మికులు తమ పేర్లను కార్మికశాఖలో  నమోదు  చేసుకోగా, వారిలో 50వేల మంది ఈ-శ్రమ్‌లో నమోదు చేసుకున్నారు. మిగిలిన కార్మికుల పేర్లను ఈ-శ్రమ్‌ యోజన యాప్‌లో నమోదు చేయడానికి అధికారులు  చర్యలు చేపట్టారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మేడ్చల్‌ జిల్లాలో ఈ-శ్రమ్‌ యాప్‌లో  కార్మికుల నమోదు ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా జనవరి 24వ తేదీకి ముందు జిల్లాలో 1,019 మందికార్మికులకు కింద రూ. 5,28,21,788 లబ్ధి చేకూరింది.  ప్రమాదవశాత్తూ మరణించిన  16 మంది అసంఘటిత కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 6లక్షల చొప్పున రూ. 96 లక్షలపరిహారం అందించారు. 216 మంది సాధారణంగా చనిపోయిన వారికి రూ. 1,98,40,000, దహస సంస్కారాల కింద 235 కార్మికుల కుటుంబాలకు రూ. 69,82,622, కార్మికుల అడపిల్లల వివాహాలకు అందించే ప్రోత్సహం కింద 164 మందికి రూ. 49,01,860 లబ్ధి చేకూరింది. ప్రసూతిసాయం కింద 379 మంది మహిళలకు రూ. 1,21,93,306, ప్రమాదంలో మృతి చెంది కేసులు నమోదు కాని ఐదుగురి కుటుంబాలకు రూ. రెండు లక్షల యాభైవేలు,  వైద్య ఖర్చుల కోసం నలుగురికి రూ. 54 వేలు అందజేశారు.

Updated Date - 2022-01-26T04:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising