ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూపు -1 పరీక్షల నిర్వహణకుపకడ్బందీ ఏరాట్లు

ABN, First Publish Date - 2022-10-08T04:18:49+05:30

గ్రూపు -1 పరీక్షల నిర్వహణకుపకడ్బందీ ఏరాట్లు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిఖిల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, అక్టోబరు7: గ్రూపు-1 పరీక్షలకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి గ్రూపు-1 పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్‌, విద్య, విద్యుత్‌, రవాణాశాఖల  అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. జిల్లాలో 14 పరీక్ష కేంద్రాల్లో 4,857 మంది అభ్యర్థులు గ్రూపు-1 పరీక్షలకు హాజరు అవుతున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టెక్నికల్‌ సిబ్బంది అందుబాటులో ఉంచాలని సూచించారు.  పరీక్షకు హాజరయ్యే మహిళా అభ్యర్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సౌకర్యాలు కల్పించాలన్నారు అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్‌ ద్వారా తీసుకోవాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యం నిమిత్తం రైల్వే, బస్‌స్టేషన్‌, ఎన్టీర్‌ చౌరస్తా  తదితర ప్రాంతాల్లో  కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని వికారాబాద్‌ డిపో మేనేజర్‌ను ఆదేశించారు. ఇన్‌చార్జి డీఆర్‌వో, వికారాబాద్‌ ఆర్డీవో సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌వో అశోక్‌ కుమార్‌, వికారాబాద్‌ ఆర్డీవో విజయకుమారరి, డీఎ్‌సపీ సత్యనారాయణ, తహసీల్దారు షర్మిల, హెచ్‌ సెక్షన్‌  సూపరింటెండెంట్‌ రవీందర్‌ దత్తు, ఇంటర్మీడియట్‌  నోడల్‌ అధికారి శంకర్‌ నాయక్‌, వికారాబాద్‌ డిపో మేనేజర్‌ మహేష్‌, అసిస్టెంట్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌చార్జి ప్రభు, ఎంఈవో బాబుసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

పోడు భూముల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

వికారాబాద్‌జిల్లాలోని పోడు భూముల శాశ్వత పరిష్కారం కోసం సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పోడు వ్యవసాయ భూముల పురోగతి, చేపట్టాల్సిన పనులపై అటవీ శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పోడు భూముల్లో దీర్ఘకాలంగా ఉన్న వారందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబరు 10 నుండి నవంబర్‌ 10 తేదీలోపు వచ్చే అర్జీలు అన్నింటిని క్షేత్రస్థాయిలో వెళ్లి పూర్తిగా ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. తక్కువ అర్జీలు ఉన్నటువంటి బంట్వారం, తాండూరు, నవాబుపేట, దౌల్తాబాద్‌, మర్పల్లి మండలాల్లో ఐదు రోజులలోపు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. మిగతా 14 మండలాల్లో ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు షెడ్యూల్స్‌ అందజేయాలని ఆదేశించారు. గ్రామాల్లో  గ్రామ సభలు ఏర్పాటు చేసే ముందు చాటింపు చేయాలని కలెక్టర్‌ సూచించారు ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్‌ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి అశోక్‌ కుమార్‌, వికారాబాద్‌ ఆర్డీవో విజయకుమారి, గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ తదితరులు  పాల్గొన్నారు.

జాతీయ పంచాయతీ అవార్డుకు ఎంపికకు ప్రతిపాదనలు సిద్దం చేయాలి

జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నికైన గ్రామాలను జాతీయ పంచాయతీ అవార్డుకు ఎంపికకు ప్రతిపాదనలు సిద్ధ్దం చేయాలని కలెక్టర్‌ అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాతీయ పంచాయతీ అవార్డుల ఎంపికపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న తొమ్మిది రకాల కార్యక్రమాల్లో అమలు సాధించే దిశగా పని చేస్తున్నటువంటి గ్రామాలను గుర్తించాలని సూచించారు. జిల్లాలో గల 566 గ్రామ పంచాయతీలో 27 ఉత్తమ గ్రామ  పంచాయతీలుగా ఎన్నిక కావడం జరిగిందన్నారు ప్రతి గ్రామంలో చేపట్టిన పనుల వివరాలను ఆన్‌లైన్‌ పది రోజులలోపు పొందుపర్చాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌డీవో అశోక్‌ కుమార్‌, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్‌, డీపీవో మల్లారెడ్డి, వ్యవసాయ అధికారి గోపాల్‌, సీపీవో నిరంజన్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T04:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising