కోటి దీపోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు
ABN, First Publish Date - 2022-11-03T23:38:36+05:30
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని పరిగిలో నిర్వహించనున్న కోటి దీపోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 12 నుంచి 16 వరకు పరిగిలోని మినీస్టేడియం వేదికగా ఉత్సవాలు నిర్వహించనున్నారు.
పరిగి, నవంబరు 3: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని పరిగిలో నిర్వహించనున్న కోటి దీపోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 12 నుంచి 16 వరకు పరిగిలోని మినీస్టేడియం వేదికగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. గురువారం స్టేడియాన్ని మైసూరు దత్తపీఠ ఆస్థాన విధ్వంసులు కొడకండ్ల శ్రీరామశరణ్ శర్మ, ఏఎంసీ చైర్మన్ సురేందర్, పూడూరు జడ్పీటీసీ మేఘమాల, పరిగికి చెందిన పురోహితులు సిద్ధాంతి పార్థసారథి, టీఆర్‌ఎస్ నాయకులు కంకల్ ప్రభాకర్‌తోపాటు తదితరులు పరిశీలించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కంకల్ ప్రభాకర్ తెలిపారు.
Updated Date - 2022-11-03T23:38:37+05:30 IST