ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

VRA Strike: సమ్మెలో ఉన్న మరో వీఆర్‌ఏ మృతి

ABN, First Publish Date - 2022-09-23T15:09:23+05:30

సమస్యలు పరిష్కరించాలంటూ నెలల తరబడి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్న మనస్థాపంతో మరో వీఆర్‌ఏ మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: సమస్యలు పరిష్కరించాలంటూ నెలల తరబడి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్న మనస్థాపంతో మరో వీఆర్‌ఏ(VRA) మృతి చెందాడు. సమ్మెలో ఉన్న రాజు(40) అనే వ్యక్తి గుండె పోటుతో కన్నుమూశారు. రాజు స్వస్థలం వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్. సమ్మె మొదలు నుంచి రాజు చురుకుగా పాల్గొంటున్నారు. కాగా గత రాత్రి తీవ్ర మనోవేదనకు గురైన రాజుకు గుండె నొప్పి రాగా... కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు కుటుంబాన్ని ప్రభుత్వమే అందుకోవాలని వీఆర్ఏ జేఏసీ డిమాండ్ చేస్తోంది. పే-స్కేల్ జీవో విడుదల చేయడంతో పాటు, ఉద్యోగ క్రమబద్దీకరణ చేయాలంటూ గత 60 రోజులుగా వీఆర్‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2022-09-23T15:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising