ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియోజకవర్గంపై పట్టింపులేని ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-10-07T05:50:07+05:30

నియోజకవర్గంపై పట్టింపులేని ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంట్వారం అక్టోబరు 6: వికారాబాద్‌ ఎమ్మెల్యేకు పార్టీ అభివృద్ధిపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గంపై లేదని కాంగ్రెస్‌ పార్టీ బంట్వారం మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంట్వారం మండలంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌లే కాకుండా కొంతమంది సర్పంచ్‌ల పట్ల అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనంద్‌ వైఖరిని తీవ్రంగా కండిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే పార్టీ అభివృద్ధికి కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడం, ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప నియోజకవర్గం అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. బంట్వారం మండలంలో ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీలోనే రెండు వర్గాలు ఉన్నాయని మీరు మొదట మీ పార్టీలో ఉన్న వర్గపోరును సరిచేసుకోవాలన్నారు. బంట్వారం మండలంలో ఉన్న కొంత మంది సర్పంచ్‌లు తమ పార్టీలోని రాకపోతే వారిపై  ఎమ్మెల్యే ఆడిట్‌ జరిపించి వారి పంచాయతీ రికార్డులు కూడా తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సొంత పార్టీ సంర్పంచ్‌లపై కుడా ఇలా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌లపై చేస్తున్న వ్యవహార శైలి బాగాలేదని నియోజకవర్గం అభివృద్దికి కృషి చేయాలని అన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి వికారాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వెంకటేశం, శంకర్‌ యాదవ్‌, యాదగిరి, వెంకట్‌రాంరెడ్డి, మహేష్‌, హజి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-10-07T05:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising