అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు గడువు పెంపు
ABN, First Publish Date - 2022-08-04T05:50:04+05:30
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు గడువు పెంపు
కొడంగల్, ఆగస్టు 3: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఽధ్యయన కేంద్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు తేదీని పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రాజారాం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఆగస్టు 16 వరకు తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. అదేవిధంగా ద్వితీయ, తృతీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం గడువును కూడా పొడగించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని చెప్పారు. కాగా, రెండో సంవత్సరం 4వ సెమిస్టర్ విద్యార్థులు ఆగస్టు 10 నుంచి, మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్ విద్యార్థులకు ఆగస్టు 22 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భగా ప్రిన్సిపాల్ తెలిపారు.
Updated Date - 2022-08-04T05:50:04+05:30 IST