పేదలందరికీ ‘డబుల్’ ఇళ్లు ఇవ్వాలి
ABN, First Publish Date - 2022-12-15T23:53:58+05:30
పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
షాద్‌నగర్ అర్బన్, డిసెంబరు 15: పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షాద్‌నగర్‌లో గురువారం ఆ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు గడుస్తున్నా నేటివరకు పేదలకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు. అనంతరం సీపీఐ షాద్‌నగర్ నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. సీపీఐ షాద్‌నగర్ నియోజకవర్గ కమిటీ కన్వీనర్‌గా పానుగంటి పర్వతాలు, కోకన్వీనర్లుగా బుద్దుల జంగయ్య, ఎం.శ్రీను, కమిటీ సభ్యులుగా ఎం.గోవింద్‌నాయక్, ఎండీ షకీల్, వెంకటేష్, అశోక్‌చారి, చెన్నయ్య, లింగంనాయక్, చంద్రబాబు, ఎం.పవన్‌చౌహన్, ఎల్లయ్య, రమేష్, మంజుల, బంధమ్మలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పర్వతాలు, కె.రామస్వామి, బి.జంగయ్య, శ్రీను పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:54:02+05:30 IST