ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2022-12-07T23:26:40+05:30

ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. 18 ఏళ్ళు నిండినవారు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్వీప్‌ నోడల్‌ అధికారి కోటాజీ సూచించారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న స్వీప్‌ నోడల్‌ అధికారి కోటాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, డిసెంబరు 7 : ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. 18 ఏళ్ళు నిండినవారు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్వీప్‌ నోడల్‌ అధికారి కోటాజీ సూచించారు. బుధవారం పరిగిలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు ఓటరు నమోదు, ఆధార్‌ అనుసంధానం, తదితర ఆంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది వరకు 18 ఏళ్లు నిండినవారంతా తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటికే గుర్తింపు కార్డు పొందినవారంతా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising