ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని పార్టీలూ బీసీల జపం చేయాల్సిందే

ABN, First Publish Date - 2022-05-19T05:30:00+05:30

అన్ని పార్టీలూ బీసీల జపం చేయాల్సిందే

ఆర్‌.కృష్ణయ్యను సన్మానిస్తున్న యాదగిరి యాదవ్‌, బీసీ సంఘం నాయకులు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభ అభ్యర్థిత్వం హర్షణీయం
  • బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్‌

వికారాబాద్‌, మే 19 : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభ అభ్యర్థిత్వం ప్రకటన పట్ల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.యాదగిరి యాదవ్‌ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆర్‌.కృష్ణయ్య నివాసంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా యాదగిరి యాదవ్‌ మాట్లాడుతూ వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం రాళ్లగుడుపల్లి గ్రామంలో జన్మించిన ఆర్‌.కృష్ణయ్య బీసీల కొరకు అనేక ఉద్యమాలు చేపట్టి విజయవంతం చేశారని గుర్తుచేశారు. వైఎ్‌సఆర్‌సీపీ రాజ్యసభకు అభ్యర్థిత్వం ప్రకటించడం శుభపరిణామన్నారు. ఆర్‌.కృష్ణయ్యను అన్ని రాజకీయ పార్టీలు దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయని, కానీ, పార్టీ కన్నా బీసీల అభివృద్ధి ముఖ్యమని, అందుకోసం ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా బీసీల తరఫున తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావడం ఎంతో దూరంలో లేదన్నారు. కార్యక్రమంలో వికారాబాద్‌, తాండూరు, పరిగి బీసీ నాయకులు ఆర్‌.కృష్ణయ్యను కలిసి సన్మానించారు.

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising