ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరూ ఓటు నమోదు చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-26T04:26:35+05:30

అర్హులందరూ ఓటు నమోదు చేసుకోవాలి

వికారాబాద్‌లో ఓటరు ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ నిఖిల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, జనవరి 25: 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ నిఖిల తెలిపారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఓటు నమోదుపై అవగాహన కల్పించాలన్నారు. యువత మొబైల్‌ యాప్‌, ఆన్‌లైన్‌ ద్వారా ఓటరు సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు వినియోగించుకోవాలన్నారు. కాగా అంతకు ముందు  కలెక్టర్‌ అధికారులు, కార్యాలయ సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ  చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, స్వీప్‌ నోడల్‌ ఆఫీసర్‌ కొటాజీ, పరిపాలన అధికారిణి హరిత, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఓటు విలువైనది

మేడ్చల్‌, జనవరి 25 (అంధ్రజ్యోతి ప్రతినిధి): అర్హత కలిగిన వారంత ఓటు కలిగి ఉండాలని, అప్పుడే ప్రజాసామ్యం వర్థిల్లుతుందని మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సంహారెడ్డి అన్నారు. మేడ్చల్‌ కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న 7,558 మంది యువతీయువకులకు ఓటర్‌ ఏపిక్‌ కార్డులను ఆయన అందించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల్లో నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, క్విజ్‌, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు అదనపు కలెక్టర్‌ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రసాద్‌, డీఆర్‌వో లింగ్యా నాయక్‌, ఏవో వెంకటేశ్వర్లు, ఎన్నికలసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T04:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising