ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరూ ఓటు హక్కు కలిగి ఉండాలి

ABN, First Publish Date - 2022-12-06T23:59:33+05:30

అర్హత గల ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని స్వీప్‌ (సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) నోడల్‌ అధికారి కోటాజీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, డిసెంబరు 6 : అర్హత గల ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని స్వీప్‌ (సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) నోడల్‌ అధికారి కోటాజీ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌ఏపీ డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదుపై స్వీప్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్‌ సమ్మరి రివిజన్‌-2023లో భాగంగా ఈ నెల 8వ తేదీ వరకు 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన విద్యార్థినీవిద్యార్థులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఓటరు కార్డుకు ఆధార్‌ కార్డు అనుసంధానం, మార్పులు, చేర్పులు, మృతిచెందిన వారి పేర్లు ఓటరు లిస్టు నుంచి తొలగింపు, తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఏపీ కళాశాల ప్రిన్సిపాల్‌, సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising