జోడో యాత్రకు ముమ్మర ఏర్పాట్లు
ABN, First Publish Date - 2022-10-18T04:36:38+05:30
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను
షాద్‌నగర్, అక్టోబరు 17 : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29న షాద్‌నగర్‌కు జోడోయాత్ర చేరుకోనున్న విషయం తెలిసిందే. షాద్‌నగర్‌లో మొదటిరోజు పాదయాత్ర తర్వాత ఆ రోజు రాత్రి రాహుల్ చిలుకమర్రి గ్రామ సమీపంలో బస చేయనున్నారు. ఆ ప్రాంగాణాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య నేతృత్వంలో చదును చేయించారు. అనంతరం ఆయన జోడోయాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాబర్‌ఖాన్, గుండ్రాతి బాలరాజ్‌గౌడ్, అందెమోహన్, నలమోని శ్రీధర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:36:38+05:30 IST