ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌ యార్డుకు అధునాతన సౌకర్యాలు

ABN, First Publish Date - 2022-01-29T05:16:47+05:30

మార్కెట్‌ యార్డుకు అధునాతన సౌకర్యాలు

కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సబితారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ యార్డుగా తుక్కుగూడ మున్సిపల్‌ మార్కెట్‌ యార్డు 
  • రూ. 34 కోట్ల వ్యయంతో అభివృద్ధి 
  • నేడు పనులకు శ్రీకారం  
  • హాజరు కానున్న మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డి


మహేశ్వరం, జనవరి 28: ఎంతోకాలంగా ఎన్నో సమస్యలతో సతమతమౌతున్న తుక్కుగూడ మార్కెట్‌యార్డు త్వరలో అధునాతన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌యార్డుగా రూపుదిద్దుకోనుంది. తుక్కుగూడ మార్కెట్‌ యార్డును ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డుగా మార్చడానికి తాజాగా ప్రభుత్వం రూ. 34కోట్లను విడుదల చేసింది. శనివారం ఈ మార్కెట్‌యార్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డిలుహాజరవుతున్నారు. కేటీఆర్‌ పర్యటనలో భాగంగా తుక్కుగూడలోని మార్కెట్‌యార్డు స్థలాన్ని మంత్రి సబితారెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమ విజయవంతానికి కావాల్సిన ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఎన్నో సమస్యలతో సతమతమౌతున్న తుక్కుగూడ మార్కెట్‌యార్డు ఇంటిగ్రేటెడ్‌ మార్కట్‌యార్డుగా రూపుదిద్దుకుంటుందన్నారు. అదేవిధంగా మార్కెట్‌ యార్డుకు వచ్చిన రైతులకు, ప్రజలకు నాన్‌వెజ్‌ ఐటమ్స్‌తో పాటు పండ్లు, కూరగాయలు ఒకేచోట అందుబాటులో ఉండేలా ఈ మార్కెట్‌ యార్డు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి వెంట మున్సిపల్‌ చైర్మర్‌ మధుమోహన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-29T05:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising