ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమకారిణి బెల్లి లలిత సేవలు మరువలేం

ABN, First Publish Date - 2022-05-27T05:18:35+05:30

ఉద్యమకారిణి బెల్లి లలిత సేవలు మరువలేం

ఇబ్రహీంపట్నంలో బెల్లి లలిత చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పిస్తున్న యాదవ సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, మే 26: మలిదశ తెలంగాణ ఉద్యమ కారిణి, విప్లవ నాయకి బెల్లి లలిత 23వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం అమరవీరుల స్థూపం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో లలిత చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకురాలు, గాయని లలిత తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని, పీడిత, కార్మిక జనం కోసం పోరాడిన యోధురాలని నాయకులు కొనియాడారు. తన పాటల ద్వారా కార్మికుల్లో చైతన్యం తెచ్చి శ్రమ దోపిడీపై పోరాడిన యువతి లలిత అని అన్నారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కసరమోని మల్లేష్‌ యాదవ్‌, బర్ల జగదీశ్వర్‌, శ్రీరాం, ఐలయ్య, బాలరాజు, మహే ందర్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.


  • తెలంగాణ నినాదాన్ని పల్లెపల్లెకూ తీసుకెళ్లిన లలిత

నందిగామ: తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలిత వర్ధంతి సందర్భంగా నందిగామలో నాయకులు, స్థానికులు ఆమె చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన ఆ టపాటలు, విప్లవ సాహిత్యంతో తెలంగాణ నినాదాన్ని పల్లెపల్లెకూ తీసుకుపోయిన యోధురాలు లలిత అని గుర్తుచేశారు. నాయకులు రజనీకాంత్‌, భీమయ్య, యాదయ్య, నర్సింలు, సుదర్శన్‌గౌడ్‌, టి.నర్సింలు, బి.లక్ష్మయ్య, దుర్గయ్య, శేఖర్‌గౌడ్‌, శ్రీకాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising