ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలు నష్టపోకుండా చర్యలు: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-11-25T00:03:42+05:30

రైతులు పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రైతులకు భరోసానిచ్చారు.

శంషాబాద్‌ రూరల్‌: చిన్నగోల్కొండ నర్సింహ చెరువు తూమును తెరుస్తున్న ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 24: రైతులు పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రైతులకు భరోసానిచ్చారు. కొద్ది రోజులుగా పెద్దగోల్కొండ ఎగ్జిట్‌ 15నీటితో మునిగిపోవడంతో 60గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే గురువారం స్థానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్‌, అధికారులతో చిన్నగోల్కొండ నర్సింహా చెరువు తూమును తెరిచారు. దీంతో చెరువులో నీరు కిందికి వెళ్లడంతో ఎగ్జిట్‌ 15 వద్ద నిలిచిన నీరు చెరువులోకి వెళ్తోంది. శాశ్వత పరిష్కారం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే చెప్పారు. అయితే రెండు రోజుల క్రితం చిన్నగోల్కొండ గ్రామానికి చెందిన రైతులు, సర్పంచ్‌ పద్మావతిఅనంతరెడ్డి అందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మావతి అనంతరెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు, మండల ప్రధాన కార్యదర్శి మెహన్‌ రావు, నాయకులు సత్యానందం, కృష్ణగౌడ్‌, రవినాయక్‌, శ్రీధర్‌గౌడ్‌, జంగయ్యగౌడ్‌, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటరు నమోదును చేపట్టాలి

శంషాబాద్‌ రూరల్‌: ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్‌, జడ్పీటీసీ నీరటి తన్వీరాజుతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత శ్రీనివాస్‌, నీరటి రాజు, మోహన్‌రావు, మోహన్‌నాయక్‌, శ్రీధర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, శివాజీ పాల్గొన్నారు.

మైనార్టీస్‌ జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు

శంషాబాద్‌: మున్సిపల్‌ కేంద్రంలోని తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో గురువారం మైనారిటీ డే, జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, వైస్‌చైర్మన్‌ బండిగోపాల్‌యాదవ్‌లతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌యాదవ్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ వెంకటే్‌షగౌడ్‌, కౌన్సిలర్లు కుమార్‌, శ్రీకాంత్‌యాదవ్‌, ప్రిన్సిపాల్‌ రాంరెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా నీరటి రాజు జన్మదిన వేడుకలు

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 24: టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, జడ్పీటీసీ భర్త నీరటి రాజు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నేతలు, స్ధానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ నీరటి రాజుకు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు రాజు నివాసంలో ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్‌, పీఎ్‌ససీఎస్‌ చైర్మన్లు దౌనకర్‌గౌడ్‌, సతీష్‌, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పూలమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-11-25T00:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising