ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రిడిటేషన్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-12-07T00:05:04+05:30

అక్రిడిటేషన్‌ కార్డుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నాయకులు మేడ్చల్‌ కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌ హరీ్‌షను కలిసి వినతిపత్రం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీయూడబ్ల్యూజే నాయకులు

మేడ్చల్‌ కలెక్టరేట్‌ వద్ద నిరసన

మేడ్చల్‌ అర్బన్‌, డిసెంబరు 6: అక్రిడిటేషన్‌ కార్డుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నాయకులు మేడ్చల్‌ కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌ హరీ్‌షను కలిసి వినతిపత్రం అందజేశారు. జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు మోతె వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రామ్‌రెడ్డిలు మాట్లాడుతూ ఇతర జిల్లాకు చెందిన సర్పంచ్‌కు ఇచ్చిన అక్రిడిటేషన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. పనిచేయని వారికి యాజమాన్యాలు లిస్టు ఇచ్చాయనే సాకుతో ఇష్టానుసారంగా కార్డులు మంజూరు చేశారని ఆరోపించారు. పెండింగులో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పట్టాలు అందించాలన్నారు. ఘట్‌కేసర్‌ మండలం కాచవానిసింగారంలో విలేకరులకు ఇచ్చిన సైట్‌ కబ్జాకాకుండా చూడాలని కోరారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్పంచ్‌కు ఇచ్చిన అక్రిడిటేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్ల స్థలాల ప్రక్రియ మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షిస్తున్నదని, నివేదిక అందగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్లు, ఆయా మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising