121 జీవోను రద్దు చేయాలి : వీఆర్వోల డిమాండ్
ABN, First Publish Date - 2022-08-04T05:57:00+05:30
121 జీవోను రద్దు చేయాలి : వీఆర్వోల డిమాండ్
వికారాబాద్, ఆగస్టు 3 : జీవో 121ను వెంటనే రద్దు చేయాలని వీఆర్‌వోలు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో కీలకపాత్ర వీఆర్వోలదేనని వారు పేర్కొ న్నారు. వీఆర్‌వోల సర్వీసు, సీనియారిటీ ప్రకారం ఉద్యోగాలివ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు వీఆర్వోలు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T05:57:00+05:30 IST