ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి పని చేసినా అందని రొక్కం

ABN, First Publish Date - 2022-10-18T04:40:22+05:30

కష్ట కాలంలో పనులు లేక పూట గడవని పరిస్థితుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఉపాధి డబ్బు కోసం కూలీల ఎదురుచూపులు
  • నెలకు పైగా పెండింగ్‌లో.. 
  • దసరా పండగకు పప్పన్నమే దిక్కు 
  • వచ్చే దీపావళి వరకైనా డబ్బులు వచ్చేనా?
  • జిల్లాలో తగ్గిన ఉపాధి కూలీల సంఖ్య
  • వ్యవసాయ పనుల్లో నిమగ్నం


కష్ట కాలంలో పనులు లేక పూట గడవని పరిస్థితుల్లో ఉపాధిహామీ పథకం పేదలకు అండగా నిలుస్తుందనుకుంటే.. పనులు చేసినా పైసలు రాక ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో శ్రమించిన నిరుపేద కూలీలకు వారాలు గడుస్తున్నా వేతనం అందని పరిస్థితి నెలకొంది. డబ్బుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఎప్పటికప్పుడు కూలీల బిల్లులు చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. కేంద్రం, రాష్ట్రం నుంచి రావాల్సిన ఉపాధి నిధుల్లో జాప్యం జరగడం వల్లే బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. 


రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 17: జిల్లాలోని కొన్ని మండలాల్లో ఉపాధిహామీ కూలీలకు నిర్ణీత సమయంలో కూలి అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని దయనీయ పరిస్థితి నెలకొంది. నెలన్నరగా కూలీలకు వేతనాలు అందడం లేదు. 6 వారాలుగా పనిచేసిన వారికి డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నారు. దసరా పండగకు కూడా కూలి డబ్బు రాకపోవడంతో కష్టజీవులకు పప్పన్నమే దిక్కైంది. కనీసం వచ్చే దీపావళి పండగకైనా డబ్బులు వచ్చేలా చూడాలని కూలీలు కోరుతున్నారు. జిల్లాలోని చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాల్లో ఆరు వారాల కూలి డబ్బులు రావాల్సి ఉండగా.. రెండు వారాల డబ్బులు కూలీల ఖాతాల్లో జమయ్యాయి. యాచారం, చౌదరిగూడ మండలంలో రెండు వారాలకు సంబంధించి పేమెంట్‌ చేశారు. ఇంకా 4వారాలకు సంబంధించి కూలి డబ్బులు చెల్లించాల్సి ఉంది. కొందుర్గు మండలంలో వారం డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. కేశంపేటలో కూలీలకు డబ్బులు చెల్లింపులు జరిగాయి. అక్కడక్కడ మిగిలిపోయిన కూలీలకు డబ్బులు వారి ఖాతాల్లో జమవుతున్నాయి. నందిగామ మండలంలో రెండు నెలలకు సంబంధించిన డబ్బులు రావాల్సి ఉంది. డబ్బులు సకాలంలో అందక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి పనులపైనే ఆధారపడి జీవిస్తున్న వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో బయట అప్పులు చేసి ఇల్లు గడుపుకోవాల్సి వస్తుందని కూలీలు ఆవేదన చెందుతున్నారు. దీంతో బిల్లులు ఎప్పుడు పడతాయోనని ఎదురు చూస్తున్నారు. ఉపాధిహామీ కూలీ డబ్బులు రూ.కోట్లలో పేరుకుపోయాయి. డబ్బు కోసం కూలీలు ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు కూలీల బిల్లులు చేసి ప్రభుత్వానికి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదంటున్నారు. కేంద్రం, రాష్ట్రం నుంచి రావాల్సిన ఉపాధి నిధుల్లో జాప్యం జరగడం వల్లే బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. నిధుల కొరత కారణంగానే కూలీలకు డబ్బులు అందటంలో ఆలస్యం ఏర్పడుతుందని తెలుస్తోంది. 

తగ్గిన కూలీల సంఖ్య

ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పనులకు వెళ్లే కూలీల సంఖ్య తగ్గింది. వర్షాలు కురవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సొంత పనులు చేసుకుంటున్నారు. పంటలు చేతికొచ్చి.. ఎండాకాల ప్రారంభంలో కూలీల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది అక్టోబర్‌ 13వ తేదీన 4,168 కూలీలు ఉపాధి పనులు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 3,025 కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కో జీపీలో ఏడుగురు కూలీలు పనిచేస్తున్నారు. హరితహారం పనులు చేస్తున్నారు. గత ఏడాది కూలీల సంఖ్యను పోల్చుకుని చూస్తే ఈసారి 1,143 తక్కువగా ఉన్నారు. 


పనిచేసినా పైసల్‌ రావడం లేదు

ఉపాధిహామీ పనులు చేసినా సకాలంలో డబ్బులు రావడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ పోషణ భారంగా మారుతుంది. నాలుగు వారాల పేమెంట్‌ రావాల్సి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డబ్బులు త్వరగా వచ్చేలా చూడాలి.

- లక్ష్మయ్య, ఉపాధిహామీ కూలీ, ఆలూరు 


ఒక్క రూపాయి కూడా రాలే

రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఏ పూటకు ఆ పూట బియ్యం కొని తెచ్చుకుని తింటు న్నాము. కూలీ డబ్బులే ఆధారం. ఐదువారాలు పనిచేశాను. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. డబ్బుల కోసం అధికారులు, బ్యాంకు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతుంది. డబ్బుల కోసం రోజూ ఎదురుచూస్తున్నాను.

- మంగలి యాదయ్య, తుమ్మలపల్లి 


సకాలంలో డబ్బులు ఇవ్వడం లేదు

పనిచేసిన వెంటనే కూలీ డబ్బులు ఇవ్వాలి. నెలల తరబడి కూలీ డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ పోషణ భారంగా మారుతుంది. నెలకు సంబంధించి కూలీ డబ్బులు రావాల్సి ఉంది. అధికారులను అడిగితే.. రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారు.

- యాదయ్య, కొత్తపల్లి, యాచారం మండలం


డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాను. 

రెండు నెలలు పనిచేశాను. ఇప్పటి వరకు ఐదు వారాల డబ్బులే వచ్చాయి. ఇంకా మూడు వారాలకు సంబంధిం చినవి రావాల్సి ఉంది. డబ్బులు రాక పోవడంతో ఉపాధి పనికి వెళ్లడం లేదు. డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. 

- బుచ్చమ్మ, మహాలింగపురం, శంకర్‌పల్లి మండలం


ఉపాధిహామీ పనుల వివరాలు

మండలాలు (గ్రామీణ) : 21

జిల్లాలో మొత్తం జీపీల సంఖ్య :  558

ఈజీఎస్‌ పనులు జరుగుతున్నవి : 449(శాతం 80)

జరగని జీపీలు : 109

మొత్తం జాబ్‌ కార్డులు : 1,77,669

పనిచేస్తున్న కూలీలు : 3,025


Updated Date - 2022-10-18T04:40:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising