ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా కళా ఉత్సవం

ABN, First Publish Date - 2022-11-25T00:01:55+05:30

జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డైట్‌ కళాశాలలో గురువారం జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డైట్‌ కళాశాలలో గురువారం జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రలేఖనం, జానపద, శాస్త్రీయ నృత్యాలు, పాటల పోటీలు జరిగాయి. జిల్లాలో వివిధ మండలాల నుంచి ఎంపిక చేసిన 45 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థి దశలో చదువుతో పాటు వివిధ కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. విద్యార్థి సమగ్రాభివృద్ధి సాధించడమే విద్య ప్రధాన లక్ష్యమని ఆమె చెప్పారు. కార్యక్రమ నిర్వాహకుడు, సెక్టోరియల్‌ అధికారి రవికుమార్‌ మాట్లాడుతూ, పని చేసినప్పుడు, శ్రమకోర్చినప్పుడు కళలు ఎంతగానో స్వాంతన కల్గిస్తాయన్నారు. విద్యార్థులకు ఒత్తిడిని తగ్గించడంలో కళలు ఎంతగానో సహాయ పడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా నవాబ్‌పేట్‌ ఎంఈవో గోపాల్‌, జీహెచ్‌ఎంలు ఎ.వీరకాంతం, ఎన్‌.మల్లేశం, హెచ్‌ఎం చిన్నకృష్ణ వ్యవహరించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని డీఈవో తెలిపారు.

Updated Date - 2022-11-25T00:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising