ఇరువురి మధ్య గొడవ.. ఒకరు మృతి
ABN, First Publish Date - 2022-10-07T06:12:30+05:30
ఇరువురి మధ్య గొడవ.. ఒకరు మృతి
ఇబ్రహీంపట్నం, అక్టోబరు 6: ఇబ్రహీంపట్నంలోని ఓ చికెన్ సెంటర్ ఎదుట గురువారం రాత్రి ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్టీసీ డిపో ఎదురుగా ఓ చికెన్ సెంటరు ముందు బైక్ పార్కింగ్ విషయంలో మైలారం సురేష్(22), సన్నాయిల దయాకర్‌లు ఘర్షణ పడ్డారు. సురేష్ దయాకర్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో దయాకర్ తన సంబంధీకులకు ఫోన్‌లో చేమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని సురేష్‌పై దాడి చేయడంతో అతను అపస్మారక స్థితిలోకివెళ్లాడు. దీంతో అతన్ని ఇక్కడ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-10-07T06:12:30+05:30 IST